చుట్టుప్రక్కల ఊర్లో వాళ్ళందరికి అయ్యగారి మంచితనం గురించి తెలుసు.
జనాలతో మమేకమై :
అంటరానితనం ప్రబలంగా ఉన్న ఆ రోజులలో దానిని ఖాతరు చేయక హరిజనులతో కలసి అనేక సంస్కృత కార్యక్రామాలు నిర్వహించాడు.
వైద్యంలో నిమగ్నమై :
ఓ సారి ఉస్మానియా ఆసుపత్రి వాళ్ళు ఇక బ్రతకడం కష్టం అని చెప్పి ఇంటికి పంపిస్తే , ఆ దొరకి (జీడికంటి రాంరెడ్డి, తాటిపాముల గ్రామనివాసి ) వైద్యం చేసి బ్రతికించాడు.
దొరలకే కాదు పేదవారికి సైతం ఉచితంగా వైద్యం అందించే వారు అనడానికి ఓ మచ్చుతునక ............ రఘునాథపల్లి నుంచి ఓ బీద మహిళా (అనాసుయా) రోగంతో వేగలేక చివరిదశలో , చూపించుకోవడానికి వస్తే, మందులకు కూడా డబ్బు లేని ఆమెకి ఉచితంగా మందులు ఇచ్చి ,భోజనం పెట్టి ఆమె రోగం తగ్గిన తర్వాతా కొంత డబ్బు ఇచి పంపారు.
ఎవరొచ్చినా ముందు వారికి వైద్యం అందించడం మొట్టమొదటి కర్తవ్యం, చేసిన తర్వాత వారేమైనా ఇస్తే తిసుకోనేది లేకపోతే లేదు.
పైగా వాళ్ళకి ఏమి లేకపోతే ఎదురుపెట్టేవారు.అది తిండైనా,మందులైన ఇతరత్రా ఖర్చులన్నీ భరించి వాళ్ళని బాగుచేసి పంపేవారు.
మనుషులని గుడ్డిగా నమ్మి :
ఇలా ఇందులోనే నిమగ్నమై వ్యవసాయం గురుంచి పట్టించుకోకుండా ఉండడం వాళ్ళ , కౌలికి తీసుకున్న వాళ్ళు దుర్మగ్నమైన ఆలోచన చేసి అప్పుడిచం,ఇప్పుడిచం అని దొంగ లెక్కలు చుప్పెట్టి భూములు మావే అని తిరగబడ్డారు.
Vyasa Maharshi Educational trust
5 years ago
No comments:
Post a Comment