అంతకుముందు రోజు.
రేపు భీష్మ ఏకాదశి ఇంట్లో ఏమీలేవు ,పిల్లలకి ఏమైనా కొనాలి అని ,డబ్బు కోసం కౌలుదారులు ఉన్న ఊరికి పొద్దు పొద్దున్నే వెళ్ళాడు నాన్న.
11 గంటల ప్రాంతంలో నేను ఇంటి ముందు ఆడుకుంటుంటే ఎవరో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి ....
అమ్మతో " అమ్మ! అమ్మ.. అయ్యగారిని మీ కౌలుదార్లు చంపరమ్మ " అన్నాడు.
అమ్మ వెంటనే చనిపోయిన స్థలానికి వెళ్ళింది. ఆ రాత్రి అందరు వెళ్ళిపోయినా తర్వాత కూడా అమ్మ ఒక్కతే అలాగే నాన్న నిర్జీవ శరీరం ప్రక్కన తెల్లారి పోలిస్ లు వచ్చి నాన్నని తీసుకువెళ్ళేదాక ఉంది.
నాన్న ని చంపినా దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు, ధైర్యం చేసి న్యాయదేవత ముందు నిజం చెప్పలేక. బాధతో అమ్మకి జరిగిన విషయం అంత చెప్పారు అమ్మకి చెబుతుంటే విన్నాను.
నాన్న తిరిగి మా ఊరికి వస్తుంటే , మా స్థలంలోనే ఉన్న గుట్ట ప్రాతం దగ్గర దొంగచాటుగా నాన్నని చంపడానికి కౌలుదారులైన కొండయ్య,బక్కాయ,చక్రపాణి కాపుకాసి ఎదురుచూస్తున్నారు. నాన్న వచ్చేది గమనిచిన వాళ్ళు ముందుగా బక్కయ్య & చక్రపాణి వచ్చి అయ్యగారు దండం అన్నారు ,ఏదో మాట్లాడడానికి వచ్చరనుకొని నిలబడితే ,వెంటనే వెనుక నుంచి కొండయ్య గొడ్డలితో మెడ మీద నరికాడు .గాయంతో ఊర్లోకి పరిగెడుతుంటే దోతి అడ్డు వచ్చి పడిపోయాడు, అదేఅదునుగా ముగ్గురు కొట్టి చంపారు.
"అమ్మ మేము నిస్సహాయులమమ్మ ,ఏమి చేయలేకపోయం. అయ్యగారు
చనిపోతు " రామ రామ " అంటుంటే మా హృదయం ధ్రవించివేసింది ." అని రోదించారు.
కథానాయకుడి మాటలలో :
అ ఒక్క రోజు తపిస్తే పొలం ఇక కోర్టు కేస్ తీర్మానం అయిపోతుండె , తర్వాత వాళ్ళు డబ్బుల మీద డబ్బులు కురుపించి ( లంచాలు ) ఎస్. ఐ., లయర్లకి కొన్నుకున్నారు. ఇంతవరకు ( 1968 -till today ) ఎవరు చంపారు అనేది తెలియకుండా చేసారు.అప్పుడు మా పెద్దన్న 18 years ఉండే .మా అమ్మ గర్వం ,మరియు జల్సా గ పెరిగి, లగ్జేరిగా ఆలోచించి దాని గురుంచి ఏమి చాయ లేక పోయాడు ,కాని చేశాను అని చెప్తాడు అది సబబు అనిపించలేదు.
పాలోల్లు అందరికి పగ ఉండేది,ఎందుకంటే వీడు ఒక్కడు బాగా అభివృధి చెందుతున్నాడు, అందరిలో పేరు వస్తుంది అని ఈర్ష్య కొద్ది ఎవరు మా గురుంచి ,ఆ కేస్ గురుంచి పట్టించుకోలేదు. అందుకే నాకు బంధువుల మీద మంచి అభిప్రాయం లేదు. మంచిగా ఉన్నన్ని నాళ్ళు ఇంటి చుట్టూ తిరిగి, కష్టాలలో ఉన్నప్పుడు కనీస ఆదరణ, ఆప్యాయత కూడా పంచలేదు.
No comments:
Post a Comment