Total Pageviews

Experience is the best teacher. Generally you will get a lot of experiences in the LIFE so the life is the best teacher. Necessity is mother of invention we have a lot of essentials to live health and wealthy. So life is a great research.

Wednesday, January 27, 2010

part -9 conclusion of father

దురద్రుష్టి లేకుండా అప్పడికి అప్పుడు ఏర్పడే పనులు చేసుకుంటూ వెళ్ళడం  వాళ్ళ భూములను కోల్పోయి పిల్లలను అనాధలను చేసుకోవలసి వచ్చింది. అందుకే ప్రతి దానిని దురద్రుష్టితో ఆలోచించాలి ,అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేది పూర్తి స్థాయిలో ఆలోచించి పనులు చేయాలి.అలా పనులు చేసే క్రమంలో భూముల గురుంచి పట్టించుకొనే వాడు, అవి అలా భూముల విషయంలో గొడవలు వచ్చేవి కావు, ఆ విధంగా చంపబడి, ఆ పరిస్థితులు వచేవి కావు.

అతి చొరవ.
"అన్యధా శరణం నాస్తి" నాకు ఎక్కడ శరణం లేదు అన్నపుడు తప్ప ,వాళ్ళ సమస్య ఏమిటో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ కోసం మనం పాటు పాడడం,వల్ల మనమే విమర్శించ బడతాము.అందుకొరకు ఎవరైనా వరంతవారే వారి సమస్యను చెప్పి సహాయం కోరక ముందు,తనంత తానుగా చొరవ తీసుకోవడం తప్పిదం అని తెలియచేసింది .దానికి ఉదహరనే వాళ్ల తమ్ముడు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయడం ,తన బంధువులు ,చుట్టాలకు పెళ్లిలు చేయడం తర్వాత వాళ్ళతో నిందలు  పడడం జరిగింది. అందుకే ఇలాంటి విషయాలలో ఆచితూచి అడుగు వేయాలి.
చిన్న చిన్న బలహీనతలు.
చిన్న చిన్న బలహీనతలు కూడా ఒకోసారి నష్టం జరుగుతుంది.
    ఏదైనా మూక్యంగా ఒక మంచి పని చేయాలి అనుకున్నపుడు, అది వ్యవసతిక్రుత మార్గం ద్వారానే చేయాలి,ఒక వ్యక్తిక దానికి సహకరించడం ,నాయకత్వం వహించండం చేయాలి  తప్ప కేవలం ఏక వ్యక్తిగా చేస్తే అది అనుకున్న లక్ష్యం పూర్తిగా నెరవేరదు, సరికదా! విల్లా వ్యక్తిగత జీవితం కూడా కోల్పోవలసి వస్తుంది.ఉదాహరణకి వైద్య సంస్థ అనేది ఒక ధర్మ సంస్థగా ఏర్పడి ,గుడిలకు మాన్యాలు ఉన్నట్టు దీనికి ఉండాలి కాని అలాంటి భూములు లేకపోవడం వల్ల ,ఉచితంగా వైద్యం చేసే సంస్థలు ,వ్యవస్థ లేకపోవడం వల్ల .
తనోక్కేడే   అలాంటి పనులు చేయడం వల్ల వ్యక్తిగతంగా నష్టపోయాడు.అలా వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్తిక్రుతంగా  చేయడం వల్ల అది లక్ష్యాని చేరుకుంటుంది, మరియు వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమస్యలని భంగాపరచకుండా ఉంటుంది.కనుక ప్రతి ఒక్కరు ఏదైనా పని చేయాలి అనుకున్నపుడు విడివిడిగా చేసే బదులుగ ఐక్యతగా, వ్యవసతిక్రుత  &  ఐ క్యవిధనంలో చేయడం మంచిది .
దాని కొరకు వ్యవస్థను ఏర్పాటు చేయడం , పాటు పాడడం ముక్యవసరం.
     అంతే కాని ఇలా ఎకవక్తిగా పనిచేస్తే  జీవితాలే దుర్భారపాలు అవుతాయి. దానికి ఉదాహరనే అతని పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు విడిపోయి, దుర్భర దారిధ్యాన్ని అనుభవించడమే సాక్ష్యం. దాని వల్ల కూడా తమ సంతానంలో మేధావులు ,పైకి రావలిసిన వారు కూడా తిండి లేక ,సరిగా బడికి వెళ్ళలేని పరిస్థితి వల్ల కూడా . ఒక మేధావిని సమాజానికి దూరం చేసినట్టు అవుతుంది. అతని మేధస్సు వల్ల అందవలసిన సేవలు సమాజానికి అందకుండా పోతుంది, దీని కారణంగా అతను సమాజానికి దూరంగా ఉంటుంది.
   కొన్ని కొన్ని సందర్బలో   అనాధగా పెరిగిన పిల్లలు అరాచక శక్తులుగా, రౌడీలుగా మారుతారు. కాని ఇక్కడ అద్రుష్టవశాత్తు అలా జరగలేదు. అయితే ఈ విధంగా బిడ్డలా భవిష్యత్తు పట్టించుకోకుండా ,దురద్రుష్టి లేకుండా చేసే పనుల వల్ల కూడా చాలా నష్టాలూ వస్తాయి.
 కథానాయకుడి మాటలలో :
    నాన్న చేసిన తప్పు ఎంటటే , మా పెద్ధన్నకు పెళ్లి చేసేటప్పుడు ,అతనికి తెలియకుండానే, అసలు ఇరువురికి పెళ్లి పై అవగాహనా లేకుండానే పెళ్లి చేసారు.దాని ఫలితంగా వారిద్దరు సక్రమంగా కలిసి ఉండలేక పోయారు  ............ of course పిల్లలని అయితే కన్నారు ,కాని వాళ్ళు  జీవితకాలం కలిసుండ లేకపోయారు. మేచుర్యుటి రాని వయస్సులో పెళ్లి చేయడం ఒక తప్పు, ఇంకోటి సంపాదన లేకుండానే చేయడం రెండో తప్పు.
దానికి కారణం గారాబంగా పెంచి ,  సంపాదన, ఆస్తులు ఉన్నాయి  కాదా అని ఉద్యోగానికి సరిగా వెళ్లకున్న కూడా ఏమి అనలేదు ,దాని కారణంగా అతని ఉద్యోగం పోయింది.

పెద్దక్క చిన్నపుడు ఓ సారి బడిలో రోజంతా గదిలో ఉంచారట ,అ విషయం అమ్మకు చెపితే బడి మానిపించింది. విద్య విధానం సరిగా లేకపోవడం వల్ల ,మా అమ్మ గారాబం వల్ల ఆమెకి చదువు రాకుండా పోయింది. ప్రక్క ఊరు అయిన చితుకూరులోని RMP Doctor కి ఇచ్చి పెళ్లి చేసాడు.కాని అతనికి చదువు రాని పిల్లని  పెళ్లి చేసుకున్నానని భావనాతో సరిగా చూసుకోలేదు.

సమీక్షా  : 
1. ఒక నిర్దిష్టమైన వైద్యవిధానం లేకపోవడం వల్ల ,ఒక  అద్భుతమైన  వైద్యుడు, తన వైద్యాని  పూర్తి స్థాయిలో వినియోగించలేక, వినియోగించిన  భంగపాటు చెందాడు.
2. కౌలుకి  ఇచ్చినదుకు కృతజ్ఞత భావం ఉండవలసింది పోయి  , హత్యా చేయడం అనేది చాలా దారుణమైన పని  . హు.... పాముకు పాలు పోసి పెంచినట్టయింది .
 అయిన వాళ్ళు చేసిన పాపం ఊరికే పోలేదు   చక్రపాణికి నరుప్పలు వచ్చి జీవితాంతం పోలేదు, ఒకడికి పిచ్చి పటింది, ఇంకొకడు చనిపోయాడు .దేవుడు వాళ్ళకి తగిన శాస్తి చేసాడు.
అయిన ఇంత వరకు ఎవరు చంపారనేది  ... కోర్టు లో నిజ నిర్ధారణ జరగలేదు.

No comments:

About Me

My photo
Dr. Sucharitha Ph.D. Theatre arts Actress Director Dancer Violinist

your Opinion on this story